Pages

Wednesday, May 6, 2009

మా వూరు మాకు గొప్ప!

"జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అని గొప్పగా చెప్పుకోకున్నా, ఎవరు పుట్టి పెరిగిన ఊరు వారికి గొప్పగానే కనపడుతుంది.

అది రాతి నేల అయినా,సస్యశ్యామలమైనా ! (మా ఊరు పచ్చగానే ఉంటుంది).

శాంతి నిలయమైనా, ఫాక్షన్ తీరమైనా! (ఎన్నికలప్పుడు తప్ప ఫాక్షన్ మా ఊరికి రాదు!) .

అలాగే మా ఊరంటే మాకిష్టం! మా ఊరు నరసరావు పేట. ఊరు మారినా ఉనికి మారలేదని, మేమూ మా వూరు గురించి ఒక బ్లాగు రాద్దామనుకుంటున్నాం!

ఊరు గురించి అనగానే ఇదేదో మా ఊరి జనభా లెక్కలూ, నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితులూ, పంటల తీరుతెన్నులూ గుర్తొస్తాయేమో! ఇవన్నీ వికీ పీడియాలోనో, ఆంధ్రప్రదేశ్ దర్శిని లోనో దొరుకుతాయి. అదేమీ కాదు. మా ఊరి చరిత్ర, కళా సాంస్కృతిక రీతులూ, కవులు, నటులు, క్రీడాకారులూ, మరియూ ఇతర ప్రముఖ వ్యక్తులు, ఇలా ఇలా. వీలైతే రాజకీయాల గురించి కూడా! ఇవే మేము ప్రస్తావించదల్చుకుంది.

గూగులమ్మని నరసరావు పేట అని అడిగితే "ఈ బ్లాగు చూడండి" అని చెప్పాలని ఆకాంక్షిస్తున్నాం. రోజుకో ఆరేడు టపాలు రాసి ఎవరికీ బోరు కొట్టించం. నెలకు రెండు,కుదిరితే మూడు టపాలు!

మా వూరు పుట్టి రెండు వందల ఏళ్లయిన సందర్భంగా 1997లో ఒక సావనీరు విడుదలైంది. అందులో అరుదైన ఫొటోలు, వ్యాసాలు ఉన్నాయి. మా బ్లాగుకోసం వాటిని కొంతవరకూ వినియోగించుకుంటున్నాం. సావనీరు అప్పటి ఎడిటరు శ్రీ కె.వి.కె రామారావు మరియు ఇతర వ్యాసకర్తలకు మా ధన్యవాదాలు.... !

ఆ ప్రాంతానికి చెందిన ఇతర బ్లాగర్లకు నరసరావుపేటతో ఉన్న బంధాన్నో అనుబంధాన్నో కనీసం పరిచయాన్నో పంచుకోవాలనుకుంటే ఇక్కడ స్వాగతం బోర్డు కడతాం!

ధన్యవాదాలు!


పేట్రియాట్స్


సుజాత,


గీతాచార్య 

22 comments:

వైష్ణవి హరివల్లభ said...

అబ్బ. భలే ఉందే పేరు!

మా వైజాగ్ మీద కూడా ఇలాగ వస్తే బావుణ్ణు. అచ్చంపేట్రియాట్స్, చిలకలూరిపేట్రియాట్స్, నరసన్నపేట్రియాట్స్, విస్సన్నపేట్రియాట్స్... అబ్బే అంత సిమిట్రీ కుదరటంలేదు.

"నరసరావుపేట్రియాట్స్" కత్తిన్నర! :-)

ఇంచక్కా 'పేట్రియాట్శ్ అని రాసుకోవచ్చుగా. చాలా మంచి ప్రయత్నం సుజాత గారూ. కొనసాగించండి. మీ నరసరావుపేట్రియాట్స్ కి ఒక ఓ..... వేసుకోండి.

Dhanaraj Manmadha said...

బాగుంది చాలా. టపా కాదు ఆలోచన. Continue... Continue...

సుజాత గారి టపాలు ఎవరికీ బోరు కొట్టవులెండి.

Kathi Mahesh Kumar said...

గమ్మత్తైన ఆలోచన. కానివ్వండి.

ప్రియ said...

Akki said what I would have said. Very nice idea. Best of luck (in the sense of collecting the required info, not for the writing because both can write really well in different styles.

I have seen so many petriats (no patriots ;-)) in blogger world I guess!!!? Everybody's a legend in their own way.

@ gItAcArya,

9th blog I hope? Veeven oorukuntaaraa? :-D

వేదాల రాజగోపాలాచార్య said...

ప్రయత్నం బాగుంది. ఆశీస్సులు. తెలిసిన విశేషాలని నేనూ పంచుకోగలను.

వేణూశ్రీకాంత్ said...

శభాష్ చాలా బాగుంది, మిగిలిన నరసరావుపేట వారందరికీ సభ్యత్వం ఏమన్నా ఉందా మరి...

పేరు కూడా భలే కుదిరింది :) khudos to you both....

సుజాత వేల్పూరి said...

@mahesh,
"గమ్మత్తైన ఆలోచన" ఏమిటంటోయ్, కామెడీ టైపులో ఉందా మా బ్లాగు? మా వూరు మాకు గొప్ప మరి! చెప్పాముగా, జనాభాలెక్కలూ, శీతోష్ణస్థితులూ, వర్షపాతం వివరాలూ ఉండవు ఇక్కడ! మా వూరి 'గొప్ప ' ఏమిటో చూస్తారంతే!

సుజాత వేల్పూరి said...

@priya
వీవెన్ ఇక వూరుకోరనే నన్ను తోడు తెచ్చుకున్నారు గీతాచార్య!

Nobody said...

కైఫీయ్యత్తులా?

చూడబోతే ఏదో గట్టి ప్రయత్నం లాగానే ఉందే? లేక పోతే ఏదన్నా అంతర్జాతీయ కుట్రా? Nobody says.

సారీ. Nobody says. బ్లాగ్ చాలా ఎగ్రెసివ్ గా ఉంది. రాసిన తీరు అద్భుతం గా ఉంది. ఇంతకీ నను నువ్వు ఒక Nobody అని వదిలేయకుండా పైన బ్యాక్లో పెట్టిన బొమ్మ ఏమిటో కాస్త చెప్తారా?

మా ఊరు మాకు గొప్ప అన్నారు. నిజమే.దాంతో పాటూ ఇలాంటి ఆలొచన రావటం కూడా గ్రేట్. పేరుకూడా చాలా బాగా పెట్టారండీ. భలే ఆలోచన.

BTW I saw this one in your profile. కూడలిలో చూస్తే కనబడలేదు. అప్పుడే ఇన్ని కామెంట్లా? వౌ.

Nobody said...

సుజాత గారు,

ఆ బొమ్మ మీ ఓఓరికేమన్నా సింబలా?

సుజాత వేల్పూరి said...

Nobody,
Thanks for your kind comment..ఎగ్రెసివ్ గా ఉందని గుర్తించినందుకు థాంక్సులు! (ఒక్కరన్నా గుర్తిచలేదే అని ఒకటే బాధగా ఉంది మీ వ్యాఖ్య చూసేదాకా)!

అవునండి, ఆ ఫొటో మా వూరిని గుర్తు తెచ్చేదే! కోటప్ప కొండ పేరు విన్నారా మీరు? మా వూరిపక్కనే! అక్కడ మహా శివరాత్రికి ఇలాంటివి తయారు చేసి కొండకు తీసుకొస్తారు. దాన్ని "ప్రభ" అంటారు. ఇది మావూరి సంస్కృతిలో ఒక భాగం. ఫొటో సంపాదించింది మాత్రం గీతాచార్యే!

కూడలిలో ఇంకా జత చేయలేదు, (బ్లాగు మొదలెట్టిందే నిన్న). కానీ మిత్రులను చూడమంటే చూసి వ్యాఖ్యలు కూడా రాశారు.

Dhanaraj Manmadha said...

Cosmopolitan look unna naa template (adele our blog templates vaalladi)ki bhale local flavor ichhaavu. aa yellowish color, prabha photo, blue content back ground, red color headers, excellent.

photo kaasta pale gaa undaite. blue-yellow combo baagundi. chinni chinni adjustments avasaram anukuntaa. May I help u? nuvvopukovule. ;-)

@ priya,

navatarangamto kalipi padi. :D

P. S. improvizations choosaka comment cheyyakunda undaleka poyanu. ika ranule.

Bolloju Baba said...

మంచి ఆలోచన.
మా వూరిపై కూడా నేనూ ఓ బ్లాగు క్రియేట్ చేసాను ఇక్కడకు వచ్చిన కొత్తలో.
http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_07.html

ప్రస్తుతం అందులో పోస్టులేమీ కొత్తవి వెయ్యక పోయినా, బ్లాగు స్టాట్స్ ప్రకారం రోజు కొద్దిమంది చూసిపోతున్నట్లు చూపుతుంది.

హేపీ యే.

అలానే మీ బ్లాగుకూడా మంచి మంచి పోస్టులతో విరాజిల్లాలని కోరుకొంటూ
జై యానం ఛ ఛ ఇక్కడ అలా అనకూడదు కదూ జై నరసరావు పేట.

సరదాగా

బొల్లోజు బాబా

Anil Dasari said...

పదిహేనేళ్ల క్రితం దాకా కోటప్పకొండ ప్రభలంటే ఏపీ వోల్ మొత్తంలో యమా ఫేమస్. ఇప్పుడెలా ఉందో మరి.

ఉత్తి పేటే కాకుండా పల్నాడు మొత్తానికీ మీ బ్లాగు వ్యాపిస్తే ఎవరి ఊళ్ల గొప్పతో వాళ్లూ చెయ్యి చేసుకుంటారుగా. కానైతే అప్పుడు బ్లాగ్పేరు మార్చాల్సొస్తుంది.

మన్లో మాట. మీ ఊరు గొప్పలగురించెన్నన్నా చెప్పుకోండిగానీ నర్సరావుపేట పల్నాడులోదని పొరపాటున కూడా అనకండి. ఇక్కడో పెద్దాయనకి ఒళ్లు మండుద్ది ;-)

గీతాచార్య said...

మరీ అంత ప్రాంతీయాభిమానం చూపించి పల్నాడు నుంచీ నరసరావుపేట ని వేరు చేస్తే (అదే గేట్ వే కాదని)ప్రత్యెక నరసరావుపేట రాష్ట్రం కోసం మేము ఒక సమితిపెట్టాల్సి వస్తుంది. మళ్ళీ సోనియా తో పొత్తు, త్వరలో కార్యాచరణ కూడా.

Vinay Chakravarthi.Gogineni said...

kotappakonda near to chilakaluripet anukunta narasarao pet kaadu kada.........

me to near from chilakaluripet.........na dggara inkonni manchipics vunnayi prbhalavi............ayina emundi abba cheppukovadaaniki narasarao pet gurinchi......

meeru em raastaaro ani curiyacity....

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
అందుకే చుట్టుపక్కల వాళ్ళు పరిచయాన్ని, అనుబంధాన్ని పంచుకోవాలని ఆహ్వానించింది! మీరు కూడా చెయ్యి చేసుకుంటే సంతోషిస్తాం! పొరపాటున కూడా మా వూరు పల్నాడులోది కాదు. కానీ పల్నాడు వెళ్లాలంటే మా వూరు దాటకుండా కుదర్దు.

వినయ్ చక్రవర్తి,
రెచ్చగొట్టేస్తున్నారు! ఏముందబ్బా అంత గొప్ప అని! వచ్చే టపా నుంచి చూడండి! ఆ ఫొటోలేవో పంచుకోవచ్చుగా ఇక్కడ!

sivaprasad said...

chala bagundhi mee blog. naa study total ga narasaraopet lone jarigindi.

గీతాచార్య said...

Where and when? Which college/school?
Then it's our town. Mana.

మేధ said...

మంచి ఆలోచన..

రోజుకి ఆరు/ఏడు పోస్ట్ లు రావన్నారు.. దానికి సంతోషం.. ఆటో ల గురించి, జనాభా లెక్కల గురించి వ్రాయము అన్నారు.. దానికి మరీ సంతోషం.. :)

మొదట పేట, తరువాత మన పల్నాడు మొత్తం గురించి వ్రాసేయండి.. జై పల్నాడు :)

మరువం ఉష said...

సుజాత, గీతాచార్య, అభినందనలు. "వూరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా అయినోరు, కన్నూరు అంతరంగాన వుందురులే" అని చదివాను. ఆ అనుభూతిని తలపుకు తెస్తూ, మీరు నెమరేసుకుంటూ, మాకూ పంచుతున్న జ్ఞాపకాలకి కోటి వందనాలు ;) ఎందుకో ఇలా "నా" "నేను" "నాది" అన్న భావనకి దూరం పోదామన్న ప్రయత్నంలో ఈ భావనలు తొలగించుకునే విఫలయత్నం చేస్తుంటాను. మీవంటి వారి మూలాన మళ్ళీ ఓటమి పాలవుతాను. ఇవన్నీ +వ్ దృక్పథంతో చెప్పినవే సుమా! :)