Pages

Tuesday, January 5, 2010

ఆంజనేయ స్వామి గుడి కథలు - 1

బ్లాగర్ లో ఉత్పన్నమైన ఒక సమస్య వల్ల ఉదయం గీతాచార్య రాసిన పోస్టు అనూహ్యంగా డిలీట్ అయిపోయింది. అందువల్ల పోస్టుకు వచ్చిన వ్యాఖ్యల్ని కూడా ఇక్కడే టపాలో పొందుపరుస్తున్నాము. గమనించండి.

నరసరావుపేటకీ ఆంజనేయస్వామికీ అవినాభావ సంబంధం ఉందేమో మరి.

అసలు మా ఊరు మొదట పుట్టిందే ఆంజనేయస్వామి ఆథ్వర్యంలో అనుకుంటా. ఇప్పుడు ’పాతూరు’ అని పిలిచే చోట అట్లూరు అనే చిన్న గ్రామం ఉండేది. అదే క్రమంగా ఇప్పటి నరసరావుపేట అనే రూపుని సంతరించుకుంది. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడిని ’పాతూరు ఆంజనేయస్వామి గుడి’ అంటారు. అదే వరసలో పాండురంగ స్వామి గుడి, పట్టభి రామస్వామి గుడి, ఇంకో రాముల వారి ఆలయం ఇలా మొత్తం నాలుగు ప్రఖ్యాత (మా ఊళ్ళో) ఆలయాలున్నాయి.

అలాగే ఇంకా శివాలయం, వెంకటేశ్వరస్వామి గుడి, (ఈ వెంకటేశ్వరస్వామి గుళ్ళు రెండు. ఒకటి శివాలయాన్ని ఆనుకునే ఉంటే, ఇంకోటి బరం పేటలో ఉంది), భావనారాయణస్వామి గుడి, ఇలా చాలా ఆలయాలున్నా, చాలామందికి ఆంజనేయస్వామి గుడి అంటే, స్టేషన్ రోడ్డులో ఉన్న గుడే మరి. అంతలా పేరు తెచ్చుకున్న ఆ ఆలయం పెద్ద గొప్పగా ఉంటుందా అంటే, చుట్టు ప్రక్కలున్న ఇళ్ళలో, షాపుల్లో కలగలసి పోయి ఇదిగో ఇలా ఉంటుంది.కానీ అక్కడ ఉండే జనం రష్, ఆ భక్తిపూర్వకమైన (అంటే కేవలం స్వామివారి మీదే కాదు. స్వామీజీ... అదే పూజారి గారి మీద కూడా) వాతావరణం, పూజారి గారి ఆత్మీయమైన పలకరింపు, దగ్గరలోనే పార్కూ, భలే దక్కడ. నాకు నాలుగేళ్ళ వయసున్నప్పుడు మేము అరండల్ పేట లో ఉండేవాళ్ళం. అంటే మా ఇంటికి మూడు ఇళ్ళవతల కుడి వైపు తిరిగే సందులో నుంచీ గట్టిగా వంద గజాల దూరం వెళితే స్టేషను రోడ్డు. అక్కడ ఎడమ వైపు ఓ పాతిక ముప్పై అడుగులేస్తే ఆంజనేయ స్వామి గుడి అన్నమాట.

ఇక్కడ చెప్పిన టైమ్ కి ఇరవై ఏళ్ళ తరువాత సుబ్రహ్మణ్యం గారు... ఆంజనేయ స్వామీ...


రోజూ సాయంత్రాలు, నేను పొద్దున స్కూలుకెళ్ళినందుకు నాన్నకి పనిష్మెంట్ గా నన్ను పార్కుకి తీసుకెళ్ళే బాధ్యత అప్పగించ బడింది నా చిన్నప్పుడు. అలా పార్కుకెళ్ళి వచ్చేటప్పుడు సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వల్ల నాన్న పార్కు నుంచీ వచేటప్పుడు అక్కడకు తీసుకెళ్ళేవారు. బట్టలు మట్టిగొట్టుకుని పోయినా ఆచార్యుల వారబ్బాయినని ఆయనకి నేనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెళ్ళగానే చేతులు కడుక్కుని రా అనేవారు. చక్కగా చేతులు కడుక్కుని నాన్న ఎత్తుకుంటే కాళ్ళకు మట్టంటకుండా వెళ్ళి దేవుడి ముందు నించుని "మా గోపీ చందుకి జ్వరమొచ్చేట్టూ చెయ్యి స్వామీ. స్కూలుకి సెలవొస్తుంది," అని ప్రార్థించి, అప్పుడు ఆయనిచ్చిన కొబ్బరి ముక్కలో, ఆకుపూజ చేసిన రోజైతే కేసరో తీసుకుని వెళ్ళేవాడిని. గోపీచందు గారంటే మా స్కూలు హెడ్డు. నాకు జ్వరమొస్తే నాకొక్కడికే సెలవు. అదే ఆయనకి జ్వరమొస్తే స్కూలు మొత్తం సెలవు. హాయిగా అందరూ రెస్టొచ్చని నా సోషలిస్టిక్కైడియా. బాగుంది కదూ. కానీ ఆయనకు జ్వరమొచ్చినా వేరే ఎవరైనా వచ్చి స్కూలు తెరుస్తారని తెలిసి, నాకు, నాకు మాత్రమే జ్వరమొస్తే చాలని కోరుకోవాలని ఙ్ఞానోదయమయ్యే సరికి ఆ స్కూలు మారిపోవటం కూడా అయిపోయింది. అలా నా ఏకవాంఛా ప్రార్థన కొన్నాళ్ళు సాగింది. కానీ జనానికి మాత్రం ఆ గుడంటే చాలా ప్రేమ. నాకు పెద్ద చరిత్రా అవీ తెలియవు కానీ ఆ గుడంటే అదొక రకమైన అభిమానం.

ఆ ఆలయానికి జనం రావటం వెనుక కారణం, నరసరావు పేటలో ముఖ్యమైన కొన్ని (ఆఫీసులూ, కోర్టూ, షాపులూ, పెద్ద పార్కూ (అంటే చెంపుచ్చుకుని పోయే పార్కు కాదు) ఆ దగ్గరలోనే ఉన్నాయి. అవిగాక ఆ పూజారి గారి తత్వం. సర్వ మానవ సౌభ్రాతృత్వం అంటే ఆయన్నిజూసే నేర్చుకోవాలనిపిస్తుంది. జనం వాళ్ళలో వాళ్ళు ఈన మా దేవుడూ, ఆయన మీ దేవుడూ అని కొట్టుకుంటారు కడుపులో దేవుడు మొదలయ్యేలా. కానీ సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఆలయానికి ఎందరు దేవుళ్ళ భక్తులొస్తారో, అంతమందినీ శాటిస్ఫై (సంతృప్తి అని వాడవచ్చు. బట్ అది నా డే టూ డే కామన్ స్లాంగ్ కాదది) చేసేలా అందరు దేవుళ్ళకీ కనీసం గాయత్రి (ఆఖరుకి మెహెర్ బాబా, మాతా అమృతానందమయి కి కూడా) అన్నా చదువుతారు. అదేమంటే ఏవి చదివినా నాకు ఆంజనేయుడే కనిపిస్తారు కదా. వాళ్ళకి వాళ్ళ దేవుడూనూ అనంటారు. అలా వచ్చిన భక్తులందరికీ అక్కడే తమ తమ స్వాములు కనబడటం వల్ల వేరెక్కడికీ వెళ్ళేవారు కాదు. పైగా పూజారి గారు అందరినీ పేరు పేరునా పలకరిస్తూ పిల్లలకి ప్రత్యేక రాయితీలిస్తుండే వారు. మఙ్ఞళ శని వారాలు ఆకు పూజలూ, వీలున్నప్పుడు భజన్లూ. ఆకుపూజని పంతులుగారు శ్రద్ధగా చేయటం ఒకెత్తైతే, ఆ టైములో ఆయన చేసే ప్రసాదాలు మరో ఎత్తు. ముందా ప్రసాదాల కోసమైనా పూజ చేయించాల్సిందే.

*** *** ***

గుడి గురించిన చరిత్రా, ఇంకా వివరాలూ ముందు ముందు చెప్తాకానీ, ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశాలు మరి కొన్ని ఉన్నాయి. ఇక్కడే, ఈ గుళ్ళోనే నా జీవితంలో మూడు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి నా ఎటిట్యూడ్ ని నిర్ణయించి నాకో మార్గ నిర్దేశనం చేస్తే, మరొకటి నేను ఉన్న షెల్ లోంచీ బయటకొచ్చి, కాస్తంత లోకఙ్ఞానాన్ని పెంచుకునేలా జేసింది. (ఇప్పుడీ పేట్రియాట్స్ పుట్టటానికి కారణం కూడా మా అంజనేయ స్వామే కారణం. పైగా ఈ పేరు ఐడియా వచ్చింది ఆయన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడే. అదే గుళ్ళో ఉన్న టైమ్ లోనే). మరి మూడో సంఘటన నా డ్రీమ్ గాళ్ ని కలిసేలా జేసింది. "గాల్లో తేలినట్టుందే...," (పాట నాదే కాపీ కొట్ట బడింది అని ఇంతకు మునుపు కాంతారావు టపాలో మనవి జేసుకున్నాను) అనుకుంటూ ఒక ఎడ్వెంచరస్ లవ్ స్టోరీ అక్కడే మొదలైపోయింది.

అదన్నమాట సంగతి. నరసరావుపేట్రియాట్స్ కి ఆంజనేయ స్వామి అనగానే గుర్తొచ్చే గుడి గురించి. నా బాల్యౌవనాలతో పెనవేసుకుని పోయిన ఙ్ఞాపకాలు ఆ గుడితో చాలా ఉన్నాయి. అవన్నీ "ఆంజనేయ స్వామి గుడి కథలు" అనే రూపంలో. ఎన్నాళ్ళ నుంచో రాద్దామనుకుంటున్నాను కానీ, ఇప్పటికి కుదిరింది.

ఆ గుళ్ళోని రాముడు టైటిల్ బార్ లో ప్రభతో పాటూ...
ఆ నించున్న మనిషున్న స్థంభం దగ్గరే నేను చెప్పిన మూడో సంఘటన జరిగితే, ఇదిగో ఇద్దరు కూచున్నారే అక్కడే నా లవ్ స్టోరీ స్టార్టయింది ;-)

విన్నపం: 1. నా వీజీయే కెమేరా సామర్థ్యాన్ని బట్టీ ఇంతకన్నా క్వాలిటీ ఫొటోలు ఆశించకూడదు. దాంతోనే అద్భుతాలు చేశాను కానీ, ప్రస్తుతం అది కూడా జంపు జిలానీ. అందుకే ఎసెసెన్ కాలేజీ గ్రౌండు గురించి వ్రాయాల్సింది ఇది మొదలైంది. అంతా మన మంచికే. ఈ సారి ఎసెలార్ వస్తుందేమో? :-D
***   ***   ***

టపా డిలీట్ అయ్యే సమయానికొచ్చిన వ్యాఖ్యలు...

చిలమకూరు విజయమోహన్ గారు:

సీత లక్ష్మణ సమేత రాములవారు ఎంతందంగా ఉన్నారండి,ఆంజనేయులవారూ కూడా.పూజారి సుబ్రహ్మణ్యంగారికి పాదాభివందనాలు.#

ప్రియ:

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? బాగుంది. కానీ ఎందుకో తృప్తిగా లేదు. ఇంకొంచం కావాలనా? లేక ఆశించిన స్థాయిలో లేదనా అనేది తేల్చుకోలేక పోతున్నాను. ఒకటి మాత్రం నిజం. మునుపటి టపాల్లోని ఎగ్రెషన్ మాత్రం లేదు. టపా అలాంటి వస్తువనా?


పూజారి గారిని చూస్తుంటే గత వైభవం అన్నట్టున్నారు. చాలా పెద్దాయననుకుంటా. హ్మ్. రాయండి. రెండో భాగం త్వరలో అని ప్రకటించలేదే? అంటే ఇప్పట్లో రాదా? :-D

If proper care is taken, these too have potential of becoming dargamitta stories. You have style.వేణూ శ్రీకాంత్


బాగుంది గీతాచార్య గారు, మిగిలిన భాగాలకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఫోటోలు కాస్త నిరాశ పరిచాయి కానీ మనఊరి వాళ్ళ మనసుల్లో ముద్రించుకుపోయిన ఆలయ ఫోటోలు ఉండగా ఈ ఎలక్ట్రానిక్ ఫోటొలతో పని ఏముందిలెండి.

నాకూ ఈ గుడి అంటే చాలా ఇష్టం, నేను ఎక్కువగా స్టేషన్ చుట్టుపక్కల ఇళ్ళలోనే ఉండే వాడ్ని, అచ్చంగా మీలాగే నాన్న నేను పార్క్ నుండి ఇంటికి వస్తూ ఈ గుడికి వెళ్ళేవాళ్లం. గుడిలో పెయింటింగ్స్ చాలా ప్రత్యేకంగా ఉండేవి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో ఎత్తుగా తడిమితే చేతికి తగిలేలా ఉండేవి చూసి అబ్బురపడేవాడ్ని. పులిహోర, అప్పాలు, కేసరి లాటి ఆకుపూజ రోజు ప్రసాదాలకు నేనూ వీరాభిమానినే.

ఈ చిన్న సత్రంలో ఉన్న ఈ గుడి ఇంత ప్రాచుర్యాన్ని పొందటానికి ముఖ్యకారణం నిస్సందేహంగా పూజారి సుబ్రహ్మణ్యంగారే. ఆయన ఆత్మీయ పలకరింపుకి ఎవరైనా మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఇంకా ఇంత చిన్న గుడిలో అందరు దేవుళ్ళ పటాలకీ చోటుకల్పించడమే కాక పూజలో సైతం స్థానం కల్పించడం నీజంగా మెచ్చుకోవాల్సిన విషయం.


మైత్రేయి


ఈ గుడి నేను కూడా చూసానండి.చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్లే చిన్న గుడి కాని ఎంతో శుబ్రంగా , పవిత్రం గా ఉంటుంది. పూజారిగారి ప్రశాంత వదనం మర్చిపోలేము.
మా వారు తన చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్తూ ఈ గుడికి తీసుకు వెళ్లారు. నరసరావు పేట్ వెళ్ళినప్పుడల్లా వెళ్తాము.
ఈ గుడి, జాని మసాలా తప్పనిసరి .


అడ్డగాడిద (The Ass)


Hmm nice post. Photos could have been better. But u gave ur reason.

enti poleramma banda kadhala ikkada kuda? :-D


సమయానికి టపాని దొరకబుచ్చుకుని అందించిన వేణూ శ్రీకాంత్ గారికీ, అతి కష్టం మీద వ్యాఖ్యలని కూడా రిట్రైవ్ చేసిన Dhanaraj Manmadha కీ thanks a lot.

4 comments:

Chivukula said...

Oh bagundi babu kadha. good. chala rojula nunchi chepthunnaru ivi rasthanani. photo la gurinchi no problem. vishayam mukhyam kani.

ప్రియ said...

హమ్మయ్య వచ్చింది కదా

Nobody said...

ఆంజనేయ స్వామి గుడి కథలు. పేరు చాలా బాగుంది. అంచనాలేవో కలిగించేలా. మీ ఆంజనేయ స్వామి ముచ్చటగా ఉన్నాడు. మీరు కూడా ఆకుపూజ అభిమానులేనా? ;-)

VSS Ravindrababu said...

looking nice...