Pages

Sunday, March 6, 2011

మనసున్న మంచి మనిషి--మా వూరి ప్రసాదు

నిజానికి ఈ టపా మా SSN కాలేజీ గురించి రాద్దామనుకున్నాను. కానీ ఇంతలోపే ప్రసాద్ అడ్డం పడ్డాడు.

ఎయిడ్స్ అనే మాట విన్నా, HIV అనే పదం వినపడినా  షాక్ కొట్టినట్లు ఉలిక్కపడతాం. భయపడిపోతాం! మృత్యువు "హాయ్" చెప్పినట్లు కలవరపడతాం! దాని బారిన పడ్డ దురదృష్టవంతులు ఎవరన్నా కనపడితే బోల్డంత జాలిపడతాం. అంతటితో మన పని సరి. కానీ ప్రసాద్ అంతటితో ఊరుకోలేదు. తను నివసించే ఊర్లో అనేకమంది ఎయిడ్స్ బారిన పడి మరణించడం చూసి రెండు కన్నీటి బొట్లు జారవిడిచి తన పనిలో తను పడలేదు. నడుపుతున్న కాలేజీ మూసేసి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరాడు. HIV రోగుల గురించి పూర్తి అవగాహన కల్గేలా వారితో కల్సి తిరిగాడు, పని చేశాడు. 

అలా పని చేశాక వాళ్ళు చనిపోయే లోపు అందరిలాగే సంతోష కరమైన జీవితం గడిపే హక్కు వారికుందనుకున్నాడు. పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం ఎత్తాడు. HIV పాజిటివ్ వ్యక్తులకోసం ఒక మారేజ్ బ్యూరో పెట్టాడు. అంతే కాదు, HIV పాజిటివ్ వ్యక్తుల కోసం ఒక మెన్స్ హాస్టల్, ఒక వుమెన్స్ హాస్టల్ పెట్టాడు. బయట హాస్టళ్ళలో ఉంటే వారికి కావలసిన పౌష్టికాహారం అందదు కదా, వివక్ష కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పని చేశాడు.

HIV పాజిటివ్ వ్యాధిగ్రస్థులకు సంబంధించిన ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం HIV పాజిటివ్ వ్యక్తులకే లభిస్తున్న నేపథ్యంలో ప్రసాద్ కి ఎటువంటి ప్రభుత్వ సహకారమూ లేదు. కేవలం వ్యక్తిగత ఆసక్తితోనూ, దాతల సహాయంతోనూ నెట్టుకొస్తున్నాడు.

దీని గురించి ప్రసాద్ ఒక వెబ్ సైటుని రూపొందించారు. www.hivmarriages.org

ప్రసాద్  ఫోన్  నంబర్ +919391183116

ఇంతకీ ఈ మంచి మనిషి ఎవరనుకున్నారు?  మా వూరబ్బాయే!  

అ మా మునిసిపల్ హై స్కూల్లో చండ శాసనుడైన తెలుగు మాస్టారొకాయన ఉండేవారు. నరసింహారావు గారని. సాధారణంగా చండశాసనులు లెక్కల మాస్టార్లై ఉంటారు. కానీ ఇక్కడలా కాదు. మాస్టారి మనసు వెన్నే గానీ మాట కఠినం!

అమ్మాయిల స్కూల్లో చదువుకునే నేను మా స్కూల్లో పాడిన పాటలు విని "బంగారూ...ఇలారా నాన్నా" అని వాళ్ళ స్టాఫ్ రూముకు తీసుకెళ్ళి తనకు నచ్చిన ఒకటి రెండు పాటలు పాడించుకుని సంతోషపడేవారు. మా స్కూల్లో పాడుతున్నా సరే, అక్కడిదాకా వచ్చి సంతోషంగా విని వెళ్ళేవారు.

ఆ నరసింహారావు గారి అబ్బాయే ఈ శ్రీనివాస హనుమత్ ప్రసాదు!

ప్రసాద్ తో ప్రత్యక్షంగా మాట్లాడాక, మన చుట్టూ ఉన్న సెలబ్రిటిల్లో ఎంతోమంది HIV పాజిటివ్ గా వుండి కొన్ని జాగ్రత్తలతో  అందరిలాగే మామూలు జీవితం ఎలా గడుపుతున్నారో తెలిశాక, చాలా వరకూ అపోహలు తొలగిపోయాయి. ఎవరైనా ఇలాంటివారు కనపడితే ధైర్యం చెప్పొచ్చనే ధైర్యం కల్గింది.

ప్రసాద్ గురించి, అతని సేవల గురించి ఇంకా ఎంతోమందికి తెలియాల్సిన అవసరం ఉంది. అతని సేవలు అవసరమైన వాళ్ళకి, అతనికి చేయూతనివ్వాలసిన వాళ్ళకి ఇతడి గురించి తప్పక తెలియాలి! అందుకే ఇవాళ్టి ఈనాడు ఆదివారం సంచికలో అతని గురించి ఒక చిన్న వ్యాసం రాశాను 


సాంస్కృతిక,సాహిత్య, కళా నేపథ్యంతో తులతూగే నరసరావుపేటకు సామాజిక బాధ్యత అనే మెరుగులు దిద్దిన ప్రసాద్ ని అందరూ అభినందించండి. మనం చేయడానికి తప్పకుండా వెనకడుగు వేసే పనిని తలకెత్తుకుని ఎంతోమంది జీవితల్లో దీపం పెట్టిన ప్రసాద్ కి తగిన చేయూతనివ్వండి.


15 comments:

drsivababu said...

ఒక సామాజిక కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నందుకు ప్రసాద్ కు అభినందనలు.ఇలాంటి విశాలదృక్పధం కల్గిన వ్యక్తులు మరింతగా విస్తరించాలి. అందుకు నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక మరియు జనవిజ్ఞానవేదిక తరపున మా వైజ్ఞానిక,హార్ధికార్ధిక సహకారం అందించేందుకు సిద్ధంగా వుంటాము.చికిత్స కంటే నివారణ ముఖ్యం అన్న సూక్తిని హెచ్.ఐ.వి.విషయంలో ప్రజలలో విస్త్రతంగా ప్రచారం చేయాలి. డా.కె.శివబాబు,జనవిజ్ఞానవేదిక,జహీరాబాద్

srini said...

Late narasimharao garu is my telugu teacher too. We always regard him with high esteem
perhaps he commanded it with his dedication to teaching. His son is just following
his father's foot steps with serving people in diff capacity. The idealism and
the drive to do that kind of service which considered a taboo and treated with much
callousness from society is commendable. Some how, everywhere only few people step up and
take their task to different level and i feel strongly that those few people do it because
of their upbringing and in prasad's case it is inculcated by his father. Though the same one
taught all of us we fell short. Thank you very much prasad garu for doing and providing the needful
to the AIDS affected people and we are all of proud of you and we will stand by you
and thanks to Sujatha garu to bring forth this information to all of us.

వేణు said...

ప్రజల్లో ప్రబలంగా ఉన్న అపోహల మధ్య సామాజిక వ్యతిరేకతను తట్టుకుంటూ, హెచ్ఐవీ వారి కోసం పనిచేయటం సామాన్య విషయం కాదు. ఇలాంటివాటికి సంకల్పబలం, ఓరిమి ఎంత ఉండాలి! హెచ్ఐవీ వివాహపరిచయ వేదికను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రసాద్ గారికి అభినందనలు!

ramana said...

it is a great thing to do that type of service.
in my next flying visit to narasaraopet, i shall call on him...
good luck..we are with you
...ramana
ramana_vnkt@yahoo.co.in

ramana said...

it is a great thing to do that type of sevice......
when i have flying visit to narasaraopet,--hyderabad-guntur-narasaraopet-hyderabad i shall meet him personally and congratulate him

ram said...

Rammohan-
i heart fully appriciate to Mr. Prasad for doing a graet job. i also congratulate to u for noticing such a grat person to all over the world and it is most inspired to all of us.

మిర్చి said...

Very nice information

బుద్దా మురళి said...

ప్రసాద్ గారికి నా తరపున అభినందనలు తెలపండి. మంచి ఎక్కడున్నా మీరు చేస్తున్నది చాల మంచి పని అని కనీసం అభినందించడం మన ధర్మం

Osseiran said...

prasad garu miru great. antakante em analo tochadam ledu.. matalanu rayagalam kani milanti vare chetalalo chupagalaru.

devudu maku kuda milanti hrudayam ivvalani korukuntunnanu

రత్న మాల said...

ప్రసాద్ గారికి అభినందనలు తెలపండి.

రత్న మాల said...

బాగా రాసారు .పేపర్ చదివినట్లుంది

Syed Naseer Ahamed said...

Nenu Narasaraopet vaadine. Bagundi.

సుజాత said...

నజీర్ అహ్మద్ గారూ, మీరు మాకు తెల్సిన నజీర్ అహ్మద్ గారేనా అని సందేహం! మీరు పాత్రికేయులుగా పని చేశారా? లేక అడ్వొకేటా?

భండారు శ్రీనివాస రావు said...

మంచి మనసున్న ప్రసాద్ గారి గురించి మంచి సంగతులు తెలిపారు. వారికి అభినందనలు - భండారు శ్రీనివాసరావు

spartakus said...

సుజాత గారు ఒక మనసున్న మంచి గురిచి పరిచయం చేసినందుకు అభినంధనలు